Wed. Apr 15th, 2026

(చట్టం ఏం చెబుతోంది?)

హైదరాబాద్, లీగల్ రిపోర్టర్: రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాద వర్గాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. కోర్టుల ఆవరణ నుంచి సోషల్ మీడియా వరకు ఎక్కడ చూసినా ప్రచార హోరు వినిపిస్తోంది. అయితే, ఈ హడావిడి మధ్య చాలామంది యువ న్యాయవాదులకు, ఒక ప్రాథమిక సందేహం కలగడం సహజం. “మనకు ఇప్పటికే బార్ అసోసియేషన్లు బలంగా ఉన్నాయి కదా, మళ్ళీ ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల ఆర్భాటం ఎందుకు?” అని. కానీ, ఇది కేవలం మరొక సంఘ ఎన్నిక కాదు. ఇది భారత పార్లమెంటు న్యాయవాదులకు కల్పించిన చట్టబద్ధమైన రక్షణ కవచం.

అసోసియేషన్ వేరు.. కౌన్సిల్ వేరు ముందుగా ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కోర్టుల్లో మనం చూసే ‘బార్ అసోసియేషన్లు’ కేవలం సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన సంక్షేమ సంఘాలు మాత్రమే. కానీ, ‘బార్ కౌన్సిల్’ అనేది అలా కాదు. ఇది అడ్వకేట్స్ యాక్ట్, 1961 (Advocates Act 1961) ద్వారా ఏర్పాటైన ఒక “చట్టబద్ధమైన సంస్థ” (Statutory Body). రాజ్యాంగబద్ధంగా న్యాయవాద వృత్తిని నియంత్రించే అధికారం, లైసెన్సులను జారీ చేసే అధికారం కేవలం బార్ కౌన్సిల్ కు మాత్రమే ఉంటుంది.

చట్టం గీసిన గీత అడ్వకేట్స్ యాక్ట్ లోని సెక్షన్ 3 ప్రకారం, ప్రతి రాష్ట్రానికి ఒక బార్ కౌన్సిల్ ఉండటం తప్పనిసరి. ఇందులో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (AG) పదవీరీత్యా సభ్యుడిగా ఉంటే, మిగిలిన పాలకవర్గ సభ్యులందరూ (సుమారు 25 మంది) న్యాయవాదుల ద్వారా, రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోబడాలి. నామినేటెడ్ వ్యక్తుల పెత్తనం కాకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రతినిధుల పాలన ఉండాలన్నదే పార్లమెంటు ఉద్దేశం. అలాగే, సెక్షన్ 8 ప్రకారం ఎన్నికైన ఈ పాలకవర్గం పదవీకాలం ఐదేళ్లు (5 Years) మాత్రమే. గడువు ముగిసిన వెంటనే కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని, తద్వారా కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోంది.

స్వయం ప్రతిపత్తి కోసమే ఈ ఎన్నికలు న్యాయవాద వృత్తి చాలా విశిష్టమైనది. కోర్టులో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా వాదించాల్సిన బాధ్యత న్యాయవాదిపై ఉంటుంది. అలాంటప్పుడు, మన వృత్తిని నియంత్రించే అధికారం అధికారుల చేతిలో ఉంటే న్యాయవాదులు స్వేచ్ఛగా పనిచేయలేరు. అందుకే “Peers Judging Peers” (తోటి న్యాయవాదులే న్యాయ నిర్ణేతలు) అనే సూత్రం ఆధారంగా బార్ కౌన్సిల్ నిర్మాణం జరిగింది. ఒక న్యాయవాది తప్పు చేశాడా లేదా అని విచారించే అధికారం (Disciplinary Action) నుండి, సంక్షేమ నిధి నిర్వహణ వరకు.. అన్నీ మన ప్రతినిధుల చేతిలోనే ఉండాలి.

అందువల్ల, ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం పదవుల కోసం జరుగుతున్నవి కావు. ఇది న్యాయవాద వృత్తి గౌరవాన్ని, స్వయం ప్రతిపత్తిని (Autonomy) కాపాడుకోవడానికి చట్టం మనపై ఉంచిన బాధ్యత. సమర్థవంతమైన పాలకవర్గాన్ని ఎన్నుకోవడం ద్వారానే ఈ చట్టబద్ధమైన ప్రక్రియకు నిజమైన అర్థం లభిస్తుంది.ర్భం. మనం ఎన్నుకునే ఆ 25 మందే రేపు మన లైసెన్స్ లకు రక్షకులు. మన సమస్యలకు పరిష్కర్తలు. కాబట్టి, ఈ ఎన్నికలు చట్టం నిర్దేశించిన “ఆబ్లిగేషన్” (బాధ్యత). ప్రతి న్యాయవాది ఓటు వేసి, సమర్థవంతమైన పాలకవర్గాన్ని ఎన్నుకోవడమే ఈ చట్టానికి మనం ఇచ్చే నిజమైన గౌరవం.

By admin

One thought on “బార్ కౌన్సిల్ ఎన్నికలు: ఇది ఆప్షన్ కాదు.. ఆబ్లిగేషన్!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *